ఆ దేశాల్లోనే ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్.. మొత్తంగా ఎన్ని దేశాల్లో చదువుకుంటున్నారంటే!!

ఉన్నత విద్య కోసం చాలామంది భారతీయులు విదేశాలకు తరలి వెళ్తుంటారు.సాధారణంగా హయ్యర్‌ స్టడీస్ అనగానే చాలామందికి అమెరికానే గుర్తుకొస్తుంది.

అయితే ప్రస్తుత గణాంకాలు చూసుకుంటే మన ఇండియన్స్ ఒక అమెరికాలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లోనూ చదువుకుంటున్నారు.ఈ విషయాన్ని తాజాగా భారత విదేశాంగ శాఖ రాజ్యసభకు వెల్లడించింది.

అయితే పైచదువుల కోసం ఇతర దేశాల కంటే ఎక్కువగా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలవైపే అడుగులు వేస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇక రీసెంట్ టైమ్స్‌లో భారతీయ విద్యార్థులు ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కజకస్థాన్ వంటి దేశాల్లో చదువుకోడానికి ఎక్కువగా మొగ్గు చెబుతున్నారు.

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఫారిన్ కంట్రీస్‌కి వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని గవర్నమెంట్ డేటా వెల్లడించింది.ఆ డేటా ప్రకారం, గతేడాదిలో ఏకంగా 7.5 లక్షల మంది పైచదువుల కోసం విదేశాలకు వెళ్లారు.2017 నాటితో పోలిస్తే ఫారిన్ చదువుల( Foreign studies ) కోసం వెళ్లే వారి సంఖ్య చాలానే పెరిగింది.అప్పట్లో చూసుకుంటే ఇండియా నుంచి కేవలం 4.5 లక్షల మందే ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకి వెళ్లారు.

Advertisement

ఇక అమెరికా( America ) మొదటినుంచి ఫేవరెట్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్ గా ఉంటుంది.గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూ ఉంటే అక్కడ మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత మన భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.భారత్ గతేడాది చైనాను కూడా వెనక్కు నెట్టి ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.ఇకపోతే బ్రిటన్‌ ప్రభుత్వం 2019లో గ్రాడ్యుయేట్ రూట్ వీసా( Graduate Route Visa ) తీసుకొచ్చిన తర్వాత అక్కడికి కూడా భారతీయ విద్యార్థులు ఎక్కువగా పోటెత్తుతున్నారు.2019లో యూకే 24,261 స్టడీ వీసాలు భారతీయులకు అందజేయగా.2022 నాటికి ఆ సంఖ్య 1.4 లక్షలకు చేరుకుంది.

కెనడాలో చదువుకునేందుకు కూడా ఇండియన్ స్టూడెంట్స్( Indian students ) ఆసక్తి చూపిస్తున్నారు.2019లో 2.2 లక్షల మంది భారతీయులు కెనడా నుంచి స్టడీ పర్మిట్‌ను పొందారు.కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 34 శాతంగా ఉంది.

ఈ దేశంలో ఇప్పుడు సుమారు 3 లక్షల మంది భారత విద్యార్థులు ఉన్నారు.మెడికల్ కోర్సెస్ చేయాలనుకునేవారు ఉక్రెయిన్, చైనా దేశాలకు వెళ్తున్నారు.

ఉక్రెయిన్ లో ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్న వారంతా తిరిగి వచ్చేసారు.సగం మెడికల్ కోర్సెస్ చేసిన వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు