ఏపీలో ఇప్పుడు వరుస వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి.ఒక పక్క ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ప్రభుత్వం కూడా … పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నడుం బిగించించింది.
దీనిలో భాగంగానే… ఈ నెలాఖరు నాటికి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీపీఎస్సీ చైర్మెన్ ఉదయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ, నెలాఖరు వరకు 25 నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.

గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు తెలుగుభాష పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ చైర్మెన్ వెల్లడించారు.