ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ”బేబీ( Baby movie )”.ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం అది మనసుకు హత్తుకునేలా ఉండడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.ఇక ఈ సినిమాను ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.

జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.రిలీజ్ అయ్యి 20 రోజులు అవుతున్న ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. విజయ్ బుల్గానిస్( Vijai bulganin ) సంగీతం అందించగా ఎస్కేఎన్ 4 కోట్లతో నిర్మించారు.ఇక ఈ సినిమా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 40.38 కోట్ల షేర్ వసూళ్లు చేయగా 85 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.అతి త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో కూడా చేరుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా థియేటర్ రన్ ఇంకా కొనసాగుతూనే ఉండగా త్వరలోనే ఓటిటి రిలీజ్ ఉంటుందని అంటున్నారు.బ్రో సినిమాను కూడా డామినేట్ చేసి బేబీ వసూళ్లు సాధించగా ఇప్పుడు ఓటిటిలో కూడా గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్టు టాక్. ఆగస్టు 18 నుండి ఈ సినిమాను ఓటిటీలో రిలీజ్( Baby OTT ) చేసే అవకాశం ఉందని సమాచారం.అయితే థియేటర్స్ లో ప్రేక్షకుల కోసం ఎన్నో కట్స్ చేసి 3 గంటల నిడివితో సినిమాను రిలీజ్ చేయగా ఇప్పుడు ఓటిటిలో మాత్రం ఏకంగా 4 గంటల నిడివితో రిలీజ్ చేయబోతున్నారట.3 గంటలైనా థియేటర్స్ లో ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు.ఇక ఇప్పుడు 4 గంటల సినిమా అయినా చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
ఈసారి మరిన్ని భావోద్వేగ సన్నివేశాలను యాడ్ చేసి రిలీజ్ చేయనున్నారట.ఇదే జరిగితే ఓటిటిలో 4 గంటల నిడివితో రిలీజ్ అయిన మొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.







