అవును, మీరు విన్నది నిజమే.కావాలంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి తిలకించండి.
అపుడు మీరే అంటారు… రీల్స్ కి( Reels ) మనుషులే కాదు, కోతులు కూడా బానిసలుగా మారిపోతున్నాయి అని.ఇటీవల కాలంలో ప్రపంచ జనాలు, మరీ ముఖ్యంగా మనదేశ యువత సోషల్ మీడియా( Social Media ) మాయలో మునిగితేలుతున్నారు అన్న విషయం నిర్వివాదాంశం.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరు వీడియోలు చూడడానికే పరిమితం అయితే, మరికొంతమంది తాము పాపులరిటి సంపాదించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అయిపోతున్నారు.
ఈ క్రమంలో కొన్నిసార్లు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ, ఒక్కోసారి ప్రాణాలమీదకి కూడా తెచ్చుకుంటున్నారు.అయితే కొంతమందికి సోషల్ మీడియా పాపులారిటీని కూడా తెచ్చి పెడుతుంది లెండి, అది వేరే విషయం.మరి ముఖ్యంగా నేటి రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా రీల్స్ కి బానిసలుగా మారిపోతున్నారు అని చెప్పుకోవాలి.
కొంతమంది రీల్స్ చూడడమే కాదు చేయడం కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.అయితే కేవలం మనుషులు మాత్రమే కాదండోయ్ కోతులు( Monkeys ) కూడా రీల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఇక్కడ వీడియోని చూస్తేనే మనకు అర్ధం అవుతోంది.
ఒక కోతి ఏకంగా బెడ్ పై పడుకొని మహారాణిలా ఏకంగా రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది చూడండి.ఈ వీడియో చూసి ప్రస్తుతం నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.ఆ కోతి మంచం పై హాయిగా పడుకొని మనుషుల మాదిరిగా రీల్స్ స్క్రోలింగ్ చేస్తూ చూడడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.కొంతమంది నెటిజనం ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు.
మనుషుల్లాగే కోతులు కూడా రీల్స్ కి ఎడిక్ట్( Addicted To Reels ) అయ్యాయని మరి కొంతమంది కామెంట్ చేస్తుంటే, రాబోయే రోజుల్లో కోతులు మనుషులమీద దండయాత్ర చేసినా ఆశ్చర్యం పడాల్సిన పనిలేదు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.