ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైంది.గత కొన్నిరోజుల కిందట ఆఫ్రికాలోని నైజీరియా నుంచి వచ్చిన ఓ యువతి చర్మంపై దద్దుర్లు రావడంతో ఆస్పత్రిలో చేరింది.
శాంపిల్స్ పరీక్షించిన వైద్యులు.మంకీ పాక్స్ సోకినట్లుగా నిర్ధారించారు.
సదరు యువతి నైజీరియా దేశానికి చెందిన వారేనని.ఢిల్లీకి వచ్చే ముందే వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం యువతికి ఎల్ఎన్ జేపీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా నమోదైన కేసుతో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది.
వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని అధికారులు తెలిపారు.







