హిందీలో భారీగా పాపులర్ అయిన షో తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా( Tarak Mehta Ka Ulta Chashma ).ఈ పాపులర్ షో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు.ఇప్పటికే మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా ఈ షో నుంచి తప్పుకోగా తాజాగా మరో నటి దిశా వకాని( Actress Disha Vakani ) కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
తాజాగా దిశా వకానీ ఉల్టా చష్మా నుంచి నిష్క్రమించడంపై మోనికా సంచలన ఆరోపణలు చేసింది.తనలాగే దిశా వకానికి వేధింపులు ఎదురై ఉండవచ్చని మోనికా కామెంట్స్ చేసింది.

దిశా వకాని షో నుంచి తప్పుకోవడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.దిశా వకానీ షోకు తిరిగిరాలేదని ఆమెకు డబ్బులు కూడా చెల్లించకపోయి ఉండవచ్చని ఆమె తెలిపింది.అందువల్లే తాను కూడా వేధింపులు భరించలేకే షో నుంచి తప్పుకుని ఉంటుందని తెలిపింది.అయితే గతంలో ఈ షో నిర్మాతలపై మోనికా భదోరియా సంచలన కామెంట్లు చేసింది.
ఆ షోలో పనిచేస్తున్నప్పుడు తనను హింసించారని ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తనతో వెట్టి చాకిరి చేయించుకున్నారు అని కానీ చివరకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో మోనికా భదోరియా బావ్రీ పాత్రతో నటించి మెప్పించింది.అయితే ఇప్పటికే ఈ షో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ నటి తన షో సెట్‌లో నరకం అనుభవించానని మోనికా చెప్పుకొచ్చింది.అయితే చివరకు తల్లి క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు కూడా తనకు ఎలాంటి మద్దతు లభించలేదని తెలిపింది.
రాత్రంతా ఆస్పత్రిలో అమ్మ వద్దే ఉండేదాన్ని వారందరూ కావాలనే షూటింగ్ కోసం ఉదయాన్నే పిలిచేవారని తెలిపింది.నా మానసిక స్థితి బాగా లేకున్నా రమ్మని బలవంతం చేసేవారనnఎదురు ప్రశ్నించలేక షూట్ కోసం వెళ్తే అక్కడ కూడా నన్ను వెయిట్ చేయించే వారు అంటూ కన్నీరు పెట్టుకుంది నటి.