సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి.సెలబ్రిటీల జాతకాలను వారి కెరియర్ ఎలా ఉండబోతుందో చెబుతూ ఉంటారు.
అయితే ఈయన చెప్పినవి నిజం కావడంతో వేణు స్వామి మాటలను నమ్మే వారి సంఖ్య కూడా అధికమవుతుంది.అయితే ఇదివరకు ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు గురించి చెప్పిన ఈయన తాజాగా నందమూరి వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో సీనియర్ హీరోల వారసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు కూడా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ సినీ కెరియర్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పటివరకు మాత్రం ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెలువడలేదు.
అయితే వేణు స్వామి మోక్షజ్ఞ సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ.మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు కానీ కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు.

ఈయన ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధిస్తారని ఈయనకు ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని వేణు స్వామి తెలిపారు.ఇక బాలయ్య రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నందమూరి మోక్షజ్ఞ రాజకీయాల గురించి కూడా వేణు స్వామి తెలియజేశారు.నందమూరి మోక్షజ్ఞ రాజకీయాలలోకి రారని ఆయనకు రాజకీయాల కన్నా సినిమా రంగంలోనే మంచి క్రేజీ ఏర్పడుతుంది అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పటికే బాలయ్య కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం పెద్ద ఎత్తున సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే.