తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో విచిత్ర పరిస్థితి నెలకొంది.ఆ పార్టీలో స్టార్ క్యాంపైనర్ లుగా సీనియర్లు చాలామందే ఉన్నారు.
అయినా ఆ నాయకులు తమ తమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతున్నారు.వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు, కాంగ్రెస్ అభ్యర్థులు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా, ఆ సంగతి పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయం పై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినా, నేతలు తమ తీరును మార్చుకోకపోవడంతో రెండు రోజుల క్రితమే కేసి వేణుగోపాల్( KC Venugopal ) తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలందరికీ గట్టిగానే క్లాస్ పీకారు.
స్టార్ క్యాంపైనర్లు కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిందే అంటూ గట్టిగానే క్లాస్ పీకరు.అయితే చాలామంది తమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతున్నారు.అయితే సీఎం సీటు కోసం సీనియర్లు చాలామంది పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రి అవుతామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.కానీ మిగతా నియోజకవర్గల్లో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జగ్గారెడ్డి బహిరంగంగానే తమను నియోజకవర్గాల్లో గెలిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ ఉండగా, మాజీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీ మంత్రి జానారెడ్డి సైతం అనుచరుల వద్ద కచ్చితంగా సీఎం అవుతామని ప్రకటిస్తున్నారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో వీరు ఎన్నికల ప్రచారం చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.
పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మాత్రమే తాను పోటీ చేయబోతున్న కొడంగల్ , కామారెడ్డి నియోజకవర్గలతో పాటు , రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.సీఎం పోస్టుపై ఉన్న ఆసక్తి , కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు మిగతా నేతలు ఎవరు అంతగా ఆసక్తి చూపించకపోవడం వంటివి కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తుంది.