'దృశ్యం 2' అప్ డేట్ వచ్చింది.. మరి రీమేక్ పరిస్థితి ఏంటో?

మలయాళం లో వచ్చిన దృశ్యం మూవీ సూపర్‌ హిట్ అయ్యింది.

మోహన్ లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తెలుగు, తమిళం, హిందీల్లో కూడా రీమేక్ అయ్యి సూపర్‌ హిట్ అయ్యింది.

ఒక్క సినిమా అన్ని భాషల్లో రీమేక్ అవ్వడం అంటే చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.అంతటి ఘన విజయం సాధించిన దృశ్యం సినిమా సీక్వెల్‌ ను మోహన్ లాల్‌ పూర్తి చేశాడు.

Mohanlal Malayalam Movie Drishyam Trailer Out On February,ott,amazon Prime,lates

అదే జీతూ జోసెఫ్‌ ఈ రీమేక్ ను తెరకెక్కించాడు.ఈ సినిమా కరోనా లాక్ డౌన్‌ కారణంగా డైరెక్ట్‌ గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

ఇప్పటికే దృశ్యం 2 ను అమెజాన్ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ విషయమై చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు.

Advertisement

అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ముందస్తు ఒప్పందం ప్రకారం అమెజాన్‌ తోనే వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.దృశ్యం 2 ట్రైలర్‌ ను ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అమెజాన్‌ అధికారికంగా ప్రకటించింది.

అమెజాన్‌ వారు ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ ఎప్పటి నుండి చేయబోతున్న విషయాన్ని ట్రైలర్‌ రిలీజ్ సందర్బంగా చెప్పే అవకాశం ఉందంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్‌ అయితే శరవేగంగా జరుగుతోంది.

ఆ విషయంలో ఎలాంటి హంగామా కనిపించడం లేదు.ఎందుకంటే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది కనుక.

దృశ్యం 2 సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది కనుక ఇతర భాషల్లో రీమేక్‌ ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.ఓటీటీ అంటే ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

సబ్‌ టైటిల్స్ లేదా ఏదో ఒక లా సినిమాను చూసేందుకు సిద్దం అవుతున్నారు.అందుకే రీమేక్‌ చేస్తే సొంత భాష లో మళ్లీ ధృశ్యం 2 ను చూసే అవకాశాలు ఉన్నాయా అనేది అనుమానం అంటున్నారు.

Advertisement

ఇప్పటి వరకు అయితే వెంకటేష్‌ నుండి కాని కమల్‌ నుండి కాని దృశ్యం రీమేక్ కు సంబంధించిన స్పష్టత లేదు.దృశ్యం 2 సూపర్‌ డూపర్‌ హిట్‌ అయితే అప్పుడు రీమేక్ గురించి ఆలోచన వచ్చే అవకాశం ఉంది.

యావరేజ్ గా ఉన్నా దృశ్యం రీమేక్‌ ఇతర భాషల్లోకి వెళ్లే అవకాశం లేదంటున్నారు.

తాజా వార్తలు