సాధారణంగా ప్రతి దర్శకుడు కొన్ని సినిమా కథలను ప్రత్యేకంగా ఒక హీరోను ఊహించు కొని రాస్తూ ఉంటారు.కానీ కొన్నిసార్లు మాత్రం ముందుగా అనుకున్న హీరోలు కథ నచ్చక రిజెక్ట్ చేయడంతో ఇక మరో హీరోతో తీసి మంచి విజయాలను అందుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు ఒక కథను రిజెక్ట్ చేయడం ఇక అదే కథ మరో స్టార్ హీరో చేసి హిట్టు కొట్టడం జరిగింది.ఇక ఇలాంటి సమయం లోనే మూడేళ్ల నుంచి ఫ్లాపులతో సతమత మవుతున్న చిరంజీవి కెరియర్ కి మరోసారి జీవం పోసిన సినిమా హిట్లర్.
ఈ సినిమా చిరంజీవినీ మరోసారి ట్రాక్ లోకి తెచ్చింది.
అయితే చిరంజీవి కెరీర్ లో హిట్ మూవీగా నిలిచిన హిట్లర్ సినిమాని ముందుగా చిరంజీవితో చేయాలని అనుకోలేదు.
ఇక మరో హీరోతో చేయాలని అనుకున్నారట.ఆ హీరో ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 1996 అప్పుడే మలయాళంలో ఓ సినిమా రూపొందుతోంది.
దానిపేరే హీట్లర్ మమ్ముట్టి హీరోగా సిద్దికి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంకా విడుదలకు నోచు కోలేదు.అయితే ఈ సినిమా విడుదలకు వారం రోజులు ముందు గానే తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత ఎడిటర్ మోహన్ నిర్ణయించు కున్నాడు.
దీని కోసం రైట్స్ కూడా తీసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఇక హిట్లర్ సినిమాకి సంబంధించి సీడి రాగా హైదరాబాద్ కు సినిమా చూడాలి అంటూ నిర్మాత ఎడిటర్ మోహన్ రైటర్ మద్దూరి రాజాకు చెప్పారట.ఈ క్రమంలోనే ఇక రాజా తన భార్యతో కలిసి హోటల్లో సినిమాను చూశారట.దీంతో తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారట.
ముందుగా మోహన్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నారట.దర్శకుడిగా ఈవీవీనీ అనుకున్నారు.

ఈ క్రమంలోనే ముందుగా అనుకున్న విధంగానే మోహన్ బాబుకు కథ వినిపించారు.అయితే అప్పటికే మోహన్ బాబు వీడియో వీడేవడండి బాబు, అదిరింది అల్లుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.దీంతో మరోసారి మోహన్ బాబుతో సినిమా అంటే బాగోదు అని ఇక అనుకున్నారట.దీంతో ఇక ఆ తర్వాత మోహన్ బాబు స్థానంలో చిరంజీవి నిసెలెక్ట్ చేసారట.
ఇక చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు కూడా చేశారట.దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య వచ్చిన తర్వాత మద్దుకూరి రాజా కాకుండా ఎల్.బి.శ్రీరామ్ రైటర్ గా మారిపోయారు.ఇలా మోహన్ బాబు చేయాల్సిన సినిమాలు చిరంజీవి చేసి పెద్ద హిట్ గా అనుకున్నారు.రైటర్ మరుధూరి రాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.