రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడిన స్టార్ క్రికెటర్ షమీ.. మంచి మనస్సంటూ?

స్టార్ క్రికెటర్ షమీ( Shami ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు అయిన షమీని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

 Mohammed Shami Saves A Man Life And Shares Video On Instagram Details, Mohammed-TeluguStop.com

షమీ ప్రమాదం బారిన పడిన ఒక వ్యక్తిని కాపాడటంతో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.వన్డే ప్రపంచకప్ లో( ODI World Cup ) అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న షమీ రియల్ లైఫ్ లో కూడా మంచి మనస్సును చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

రోడ్డు ప్రమాదానికి( Road Accident ) గురైన వ్యక్తిని కాపాడిన షమీ ఆ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.నైనిటాల్( Nainital ) రోడ్డు మార్గంలో శనివారం రాత్రి ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లగా షమీతో పాటు వాహనదారులు బాధితుడిని రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ ఘటన గురించి షమీ తన పోస్ట్ లో అతడు అదృష్టవంతుడని దేవుడు అతడికి మళ్లీ జీవితం ఇచ్చాడని పేర్కొన్నారు.

నైనిటాల్ లో అతని కారు ఘాట్ రోడ్ నుంచి పక్కకు దూసుకుపోయిందని షమీ అన్నారు.నా కారుకు( Car ) కాస్త ముందుగానే ఈ ఘటన చోటు చేసుకుందని షమీ చెప్పుకొచ్చారు.వెంటనే అక్కడున్న వారితో కలిసి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని షమీ అభిప్రాయం వ్యక్తం చేశారు.అతడి పరిస్థితి బాగానే ఉందని షమీ తెలిపారు.మరో సందర్భంలో షమీ మాట్లాడుతూ ట్రావెలింగ్( Travelling ) అంటే నాకు ఇష్టమని తెలిపారు.

ఫిషింగ్( Fishing ) చేయడాన్ని కూడా నేను ఎంతగానో ఇష్టపడతానని షమీ చెప్పుకొచ్చారు.దూర ప్రాంతాలకు డ్రైవింగ్ కూడా ఇష్టమేనని కార్లు, బైకులు నడుపుతానని షమీ కామెంట్లు చేశారు.కార్లు, బైక్ లతో పాటు బస్, ట్రక్ లను నడిపేవాడినని షమీ అన్నారు.ఒకసారి మా ట్రాక్టర్ తో చెరువులోకి దూసుకెళ్లానని అప్పుడు మా నాన్న చీవాట్లు పెట్టారని షమీ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube