ఒడిశా రైలు ప్రమాదం బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తుందని తెలిపారు.
రైలు ప్రమాదానికి ప్రధానమంత్రి మోదీ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.