సంక్షేమ పథకాలు అమలు విషయంలో కరకు గా ఉండే మోడీ సర్కార్( Modi government ) గత తొమ్మిదేళ్ల పరిపాలనలో అనేక నిత్యవసర వస్తువులతో మీద, ఆహార వస్తువుల మీద జీఎస్టీ విధించిన విషయం తెలిసిందే .కార్పొరేట్లకు ఉదారంగా పన్ను మాఫీలు చేసే మోదీ సర్కార్ పేదలకు ప్రాణాధారమైన సంక్షేమ పథకాల మీద మాత్రం శిత కన్ను వేస్తుందన్నది ప్రతిపక్షాల ఆరోపణ .
దానికి తగ్గట్టే గ్యాస్ బండ ధర దగ్గర నుంచి పెట్రోల్ ధర వరకూ మెజారిటీ ప్రజలకు నిత్యవసర వస్తువులైన వస్తువులపై నానాటికీ పన్నులు పెంచుకుంటూ వెళ్తున్న మోడీ సర్కార్ ఇప్పుడు వాటిని సామాన్యులకు తీవ్ర భారం అయ్యే స్థాయికి పెంచింది.మోడీ పరిపాలన ప్రారంభం కాక ముందు కేవలం 500 రూపాయలకు దొరికే గ్యాస్ బండ( cylinder ) ఇప్పుడు 1150 రూపాయలకి చేరిందంటే కేంద్రంలో తిరుగులేని మెజారిటీలో భాజపా ( bjp )ఉండటమే కారణం.
ప్రశ్నించేందుకు గాని పోరాటాలు చేసేందుకు ప్రతిపక్షాలకు బలం సరిపోని స్థాయిలో కేంద్రంలో కూర్చున్నందువల్లే ఇంతకాలం ఆడింది ఆట పాడింది పాటగా నడిపించిన భాజాపా సర్కార్ ఇప్పుడు పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు రావడంతో ఇప్పుడు తీరిగ్గా ప్రజల అవస్థల గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఇంతకాలం అంతర్జాతీయ విఫణి లో చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్( Petrol ) ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ తగ్గించడానికి ఇష్టపడని మోడీ సర్కార్ ఇప్పుడు ఒక్కసారిగా గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించడం వెనక ఎన్నికల ప్రయోజనాలే ఉన్నాయన్నది సుస్పష్టం.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో సరైన ఫలితాలు పొందకపోతే అది వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రెఫరండంగా మారే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ ఉపశమనాన్ని ప్రజలకు కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాక వచ్చే కొన్ని రోజుల్లో మరికొన్ని తగ్గింపులు కూడా ఉంటాయని తెలుస్తుంది.
కేవలం ఎన్నికల ముడిసరుకు గా మాత్రమే ప్రజాభిప్రాయాన్ని చూస్తున్న మోడీ సర్కార్ చర్యకు భారత ప్రజానీకం ఎలా స్పందిస్తుందో చూడాలి
.






