ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని బన్సీలాల్ పేట్ లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో నెహ్రు కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయని మల్లికార్జున ఖర్గే తెలిపారు.కాంగ్రెస్ పెట్టిన పరిశ్రమలను మోదీ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.మోదీ, కేసీఆర్ కలిసి పేదలను దోచుకుంటూ వారిని మరింత పేదలుగా మారుస్తున్నారని ఆరోపించారు.
మోదీ, కేసీఆర్ ధనవంతులకే కొమ్ముకాస్తున్నారన్న ఖర్గే కేసీఆర్ అవినీతి తెలంగాణ నుంచి ఢిల్లీకి పాకిందని విమర్శించారు.బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను ఖాళీగా ఉంచిందని మండిపడ్డారు.







