గుజరాత్​ టైటాన్స్​కు టానిక్ లా మారనున్న మోదీ, అమిత్ షా! IPL ఫైనల్​కు రాబోతున్నారట?

IPL​లో తొలి సీజన్లోనే బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దుమ్ములేపింది.వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

 Modi Amit Shah To Become Tonic For Gujarat Titans Are You Coming To The Ipl Fin-TeluguStop.com

ఈ మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ను పెవిలియన్ కి పంపి ఫైనల్ చేరింది.అదలావుంచితే, ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 29న ఈ మ్యాచ్ జరగనుంది.

కాగా IPL ఫైనల్​ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ మ్యాచ్​కు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు హాజరవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

మోదీ, షా కూడా వస్తుండటంతో స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశం కలదు.ఈ మ్యాచ్​కు సంబంధించి టికెట్లు కూడా ఇప్పుటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లు సమాచారం.అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనకూడా ఇంకా వెలువడకపోవడం కొసమెరుపు.కానీ స్టేడియం వద్ద మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు లక్షల మంది సమక్షంలో మ్యాచ్​ను తిలకిస్తే ఆ ప్రభావం త్వరలో రాబోయే ఎన్నికల్లోనూ చూపే అవకాశం లేకపోలేదు.ఇక IPL​ ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, లఖ్​నవూ జట్లు పోటీపడుతున్న విషయం విదితమే.

Telugu Amitha Sha, Gujarat Titans, Narendramodi, Pm Modi, Teams-Latest News - Te

ఇక్కడ జరగబోతున్న మ్యాచ్లో గెలిచిన జట్టు మే 27న క్వాలిఫయర్​-2లో రాజస్థాన్​ను ఢీ కొంటుంది.అందులో గెలిచిన టీం ఫైనల్​లో గుజరాత్​ తో తలపడనుంది.ఇక ఈ 3 జట్లలో ఏది ఫైనల్ చేరుతుందో మే 27న తేటతెల్లం అయిపోతుంది.ఒకవేళ గుజరాత్​, లఖ్​నవూ ఫైనల్లో తలపడితే.IPL​ చరిత్రలో 2 కొత్త జట్లు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కానుంది.కొత్త జట్టే ఛాంపియన్​గా అవతరిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube