బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు ఈనెల 27న ధర్మాసనం విచారణ చేయనుందని తెలుస్తోంది.
జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కవిత పిటిషన్ ను విచారించనున్నారు.ఐటెం నంబర్ 36గా ఎమ్మెల్సీ కవిత కేసు లిస్ట్ లో ఉందని సమాచారం.
అయితే మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై ఈనెల 14న కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా ముందుగా ఈనెల 24న కేసు విచారణ చేస్తామన్న ధర్మాసనం తాజాగా ఈనెల 27న విచారించనున్నట్లు తెలిపింది.