ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది.ఈ మేరకు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరు పరచనున్నారు.
సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట కవితను ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.కాగా కవిత తరపున న్యాయవాదులు విక్రమ్ చౌదరి, రమేశ్ గుప్తా ( Vikram Chaudhary, Ramesh Gupta ) కోర్టులో వానదలు వినిపించనున్నారు.
కవిత ఆరోగ్య పరిస్థితి బాలేదంటున్న కవిత న్యాయవాదులు ఈడీ కస్టడీని ఛాలెంజ్ చేయనున్నారని తెలుస్తోంది.మరోవైపు కవితను మరో వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు.
కాగా లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈ నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.వారం రోజుల పాటు కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు లిక్కర్ పాలసీ కేసుపై ప్రశ్నించిన సంగతి తెలిసిందే.