ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.తమ భూమి ఆన్ లైన్( Land Online ) లో ఇతరుల పేరు మీద ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడింది.
ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఈ దారుణం జరిగింది.కాగా స్థానిక ఎమ్మార్వో లంచం తీసుకుని తమ భూమిని ఆన్ లైన్ చేయలేదంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు.కాగా సుబ్బారావు రైలు కిందపడి బలవన్మరణం చెందగా.

ఆయన సతీమణి, కుమార్తె ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు( police ) ఘటనాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సుబ్బారావు పెద్ద కుమార్తె హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.







