ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈడీ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
విచారణకు హాజరైన కవితను ఈడీ అధికారులు ఫోన్ అడిగారని తెలుస్తోంది.అయితే ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వచ్చానని చెప్పడంతో సిబ్బందిని పంపించి కవిత ఫోన్ తెప్పించారని సమాచారం.
ప్రస్తుతం కవిత ఫోన్ ఈడీ అధికారుల చేతిలో ఉంది.ఈ నేపథ్యంలో ఫోన్లను మార్చడంపై కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు.2021-22 లో లిక్కర్ స్కాం దర్యాప్తు సమయంలో ఎమ్మెల్సీ కవిత పది ఫోన్లు మార్చారని ఈడీ చెబుతోంది.కవిత ఫోన్లు మార్చినట్లు సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది.







