ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈనెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది.

రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ప్రకాశం -నెల్లూరు - చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, శ్రీకాకుళం- విజయనగరం - విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ప్రకాశం - నెల్లూరు -చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప - అనంతపురం - కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరగనున్నాయి.

కాగా ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు