కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఎమ్మెల్యే సీతక్క కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.“నా అన్న రేవంత్ రెడ్డికి.ధన్యవాదాలు.కచ్చితంగా దేశంలో మీరు అతి శక్తివంతమైన ప్రజల ముఖ్యమంత్రిగా మారుతారు” అని స్పష్టం చేయడం జరిగింది.ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు ఎమ్మెల్యే సీతక్క పోస్ట్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి పదవి ఎమ్మెల్యే సీతక్కకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోపక్క రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా జనాలు సంబరాలు చేసుకుంటున్నారు.చంద్రబాబు శిష్యుడయ్యారంటూ.తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల సైతం అభినందనలు తెలియజేస్తున్నారు.ఇదే సమయంలో తమ సామాజిక వర్గం నుండి మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు అంటూ పలువురు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.
ఏది ఏమైనా చాలాకాలం నిరీక్షణ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం… సంచలనం సృష్టించింది.ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ దూకుడు రాజకీయంతోనే ఈ విజయం దక్కిందని చాలామంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత… కాంగ్రెస్ పుంజుకోవటం జరిగిందని అందువల్లే విజయం సాధించారని అంటున్నారు.