తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ దర్శించుకున్నారు.మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పైలెట్ రోహిత్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.
రెండు తెలుగు రాష్ట్రాల సఖ్యతతో మెలగాలని, రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టి ఘన విజయం సాధించాలని ప్రార్ధించినట్లు చెప్పారు.ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టియేనని, కెసిఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు రైతు బంధువు ఇవ్వడం జరిగిందన్నారు.