టిటిడి ఆలోచన వైఖరి మార్చుకోవాలి - ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

టిటిడి ఆలోచన వైఖరిని మార్చుకోవాలని, వీలైనంత ఎక్కువ మందికి స్వామి వారి దర్శనం కల్పించే విధంగా టిటిడి దృష్టి సారించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టిటిడిని విజ్ఞప్తి చేశారు.బుధవారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో పయ్యవుల కేశవ్ చివరి రోజు వైకుంఠ ద్వార దర్శనం గుండా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

 Mla Payyavula Keshav Fires On Ttd Board Details, Mla Payyavula Keshav, Ttd Board-TeluguStop.com

దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ‌ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.

వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని, వీలైనంత ఎక్కువ మంది భక్తులకు స్వామి దర్శనం కల్పించాలని, లక్షల సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తులకు ఏరకమైన సౌఖర్యాల కల్పనకు ఎటువంటి విధానాలు అవలంభించాలనే దానిపై టిటిడి దృష్టి పెట్టలని కోరారు.

నలభై ఐదు మంది భక్తులు మాత్రమే, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే రావాలి అనే సంప్రదాయంను తీసుకొస్తుంది, వేల సంవత్సరాల నుండి లక్షల ఇరవై వేల మందికి దర్శనాలు చేసిన సందర్భాలు ఉన్నాయని, సగటున ఎనభై,తొంభై వేల మందికి దర్శనం చేసుకునే అవకాశం ఉన్న చోట, నలభై ఐదు మందికే తగ్గించడం అంట మిగిలిన వారి దర్శనం లేకుండా చేయడమేనని ఆయన అన్నారు.

ఇలాంటి పద్దతిని టిటిడి మానేసి తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం ఏరకంగా కల్పించాలి అనేది టిటిడి ప్రయత్నించాలన్నారు.చాలా మంది భక్తులు శబరిమలైకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ తిరుమలకు వస్తారు.

Telugu Mlapayyavula, Tirumala, Ttd Board-Political

అదే సమయంలో టిక్కెట్టు లేదు అంటే హిందూ ధర్మంలో చాలా భాధ కలిగించే అంశంమన్నారు.టిటిడి ఆలోచన వైఖరి మార్చుకోవాలని టిటిడికి ఆయన విజ్ఞప్తి చేశారు.వంద రూపాయలు వసతి ఉండే వసతి భవనాలు 1500 చేయడం, సామాన్య భక్తులను స్వామికి దూరం చేసినట్లే అవుతుందని విమర్శించారు.నూతన విధానం ద్వారా భక్తులను దూరం చేసే ఆలోచన వస్తుందని, దయచేసి అటువంటి వాటికి తావులేకుండా చేయాలన్నారు.

వసతి గదులు టిటిడి కట్టింది కాదని, దాతలు కట్టి ఇచ్చి వాటిని సామాన్య భక్తులు అందుకోలేనంతగా ధరలు పెంచడం భాధాకరం అన్నారు.భక్తులు ఎంతగానో ఇష్టపడే లడ్డూ ప్రసాదంను గతంలో ధరలు పెంచారని, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని టిటిడి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

ఆనంద‌నిలయం సంబంధించి బంగారు తాపడం చేసే ముందు విస్తృతమైన సలహాలు,‌ సూచనలు చేయాలని, ఆగమపండితులు, పీఠాధిపతులు,‌మఠాధిపతులతో సంప్రదించి దర్శనాని అనుమతిస్తారా లేదా అనే విషయం వార్తల్లో వస్తుందని, ఆలయంకు పై భాగంలో పనులు జరుగుతుంటే దర్శనం కల్పించవచ్చా అని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆయన టిటిడిని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube