కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) అన్నారు.రైతులను దళారులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్( BRS ) పాలనలో ఏనాడు ధాన్యానికి ఇంత తక్కువ ధర ఇవ్వలేదని తెలిపారు.ఈ క్రమంలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే స్పందించిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు( Grain Purchase Centers ) కేంద్రాలను ఏర్పాటు చేసింది.