నిరవధిక సమ్మె చేపట్టిన మున్సిపల్ కార్మికులకు వీడియో కాల్ ద్వారా మాట్లాడి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

85 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఉన్నఫలంగా తొలగించడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ ఆగ్రహం వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో ఫోను ద్వారా తమకు న్యాయం జరిగేందుకు మీ సహకారం అందించాలని మొరపెట్టుకున్నా మహిళా కార్మికులు.

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం లో నిరవధిక సమ్మె చేపట్టిన మున్సిపల్ కార్మికులకు వీడియో కాల్ ద్వారా మాట్లాడి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

మున్సిపల్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కు తానెప్పుడూ అండగా ఉంటా ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు.కరోనా విపత్కర సమయంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉండటంతో హిందూపురం మున్సిపాలిటీలో 85 మంది నూతనంగా తీసుకున్నారు.

MLA Nandamuri Balakrishna Spoke In Support Of The Indefinite Municipal Workers

గతనెల మార్చిలో వారిని వేతనాలకు సైతం ఇవ్వకుండా ఉన్నపళంగా విధుల నుంచి తొలగించారు.ఆ కార్మికులు హిందూపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె బాట కార్యక్రమం చేపట్టారు.

ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న ఏ ఒక్క అధికారి ఏ ఒక్క అధికార పార్టీ నాయకులు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులకు న్యాయం చేయాల్సిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ ఆందోళన చేస్తున్న కార్మికుల టెంట్ వద్దకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తుందని కార్మికుల తెలిపారు.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు బిజెపి కౌన్సిలర్ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలిపారు.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీడియో కాల్ చేసి కార్మికులను మాట్లాడి మీకు న్యాయం చేసేంత వరకు తాను మీకు అండగా ఉండాలని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు