హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన జాతీయ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
అయితే ఎమ్మెల్యే మైనంపల్లి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.కాగా మొత్తం తనకు మూడు సీట్లు కావాలంటూ కాంగ్రెస్ ఎదుట ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.
మల్కాజ్ గిరి నియోజకవర్గంతో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.కాగా నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ పంపిన సంగతి తెలిసిందే.