తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) పై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో తన కొడుకుని సానుభూతితో గెలిపించుకోవడానికి ఏకంగా తన సోదరుడు జేసి దివాకర్ రెడ్డిని కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడని పెద్దారెడ్డి కామెంట్ చేయడం సంచలనం రేపింది.
ఇటీవల చేసే ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు.అసలు తాడిపత్రిలో నేను లేకపోతే ఏదో జరుగుతుందన్న భ్రమలు కల్పించడానికి జెసి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఇదంతా కేవలం ఆయన టిడిపిలో టికెట్ తెచ్చుకోవడానికేనని పెద్దారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జేసీ సోదరులు( JC Brothers ) ఇలానే వ్యవహరించారని ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పోతున్నారన్నారు.ఇప్పటికే జెసి ప్రభాకర్ రెడ్డి మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నారని రానున్న రోజుల్లో ప్రభాకర్ రెడ్డి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పారు.
తన కుమారుడిని ఎమ్మెల్యే చేసుకోవాలన్న తాపత్రయంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటే ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి( Asmith Reddy ) మాత్రం పబ్బులు చుట్టూ తిరగాలనుకుంటున్నారని వీరిని ఆ దేవుడే కాపాడాలంటూ పెద్దారెడ్డి కామెంట్ చేశారు.ప్రస్తుతం తన ఇంట్లో బెడ్ మీద ఉన్న అక్కను చంపేందుకు ఒక డాక్టర్ తో మాట్లాడారని అయితే ఆ డాక్టర్ భయంతో తప్పించుకున్నారన్నారు.
దీనికి నా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధమని పెద్దారెడ్డి( Kethiredddy Peddireddy ) అన్నారు.ఇది తెలిసిన జెసి దివాకర్ రెడ్డి తాడిపత్రికి రావాలంటే భయపడుతున్నారని తనను కూడా చంపి ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచనతో చేసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారన్నారు.
ప్రస్తుతం తాడిపత్రిలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ కాంపౌండ్ నిర్మిస్తుంటే జేసీకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.అక్కడ 120 అడుగుల రోడ్డు ఉంటే నీ ఇంటితో సహా అన్ని మార్పు వేయించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఒకసారి నేను వారి ఇంటికి వెళితే అదృష్టం పట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యాడని.ఇప్పుడు నాతో తన్నించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.ఈసారి నేను తంతే ఎమ్మెల్యే అయ్యేంత అదృష్టం పడుతుందని నేను అలాంటి పని చేయను అంటూ పెద్దారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.