సినీనటుడు మోహన్ బాబుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిల జన్మదిన శుభాకాంక్షలు వేద ఆశీర్వచనంతో దీవెనలు సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మంగళవారం మోహన్ బాబు యూనివర్సిటీలోని ఆయన ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు శాలువలతో సత్కరించి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం వేద పండితులచే ఆశీర్వదించనం చేయించారు.అలాగే కళాశాలలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈఓ మంచు విష్ణును మర్యాద పూర్వకంగా కలసిన మోహిత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.