బాబు బహిరంగ లేఖ పై మిశ్రమ స్పందన?

గత ఒకటిన్నర నెలలుగా రాజమండ్రి జైల్లో( Rajahmundry Jail ) రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న ఆంధ్రా ప్రతిపక్ష నేత చంద్రబాబు( Chandrababu Naidu ) విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది .

అయితే ముందుగా చంద్రబాబు స్వయం గా లేఖ రాసినట్టుగా ప్రచారం జరిగినా మూలాఖత్ సమయంలో తమతో చంద్రబాబు తమ ఆలోచనలు పంచుకున్నారని అందుకే ఆయన పేరుతో లేఖ విడుదల చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.

ప్రధానంగా లేఖలో ప్రస్తావించబడిన విషయాలు చూస్తే కుట్ర చేసి తన అరెస్టు చేశారని, అయితే తన సంకల్పాన్ని ఈ జైలు గోడలు చెరిపేయలేవని జైలు ఊచలు నన్ను ప్రజల నుంచి దూరం చేయలేవని ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా తన అరెస్టు చేసినంత మాత్రాన ప్రజలకు తనకు మధ్య దూరం పెరగదని తాను ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి రూపంలోననో సంక్షేమం రూపంలోనో ప్రజల మధ్యనే ఉంటానని, తాను భౌతికంగా జైలు గోడల మధ్య ఉన్నా తాను ఎప్పుడూ ప్రజల మనసులలో ఉంటానంటూ ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది.

జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే 45 సంవత్సరాల రాజకీయ జీవితం కళ్ళ ముందు కదిలింది అంటూ బావోద్వేగం గా చంద్రబాబు స్పందించినట్లుగా తెలుస్తుంది.

నిజానికి దసరా సందర్భంగా తెలుగుదేశం పార్టీ( TDP ) పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఇంతకుముందు రాజమండ్రి లో జరిగిన పార్టీ మహానాడు కార్యక్రమం లో( Mahanadu ) ప్రకటించింది.కానీ ఇప్పుడు అదే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీ గా చంద్రబాబు ఉండడం విది విచిత్రం అనే చెప్పాలి.అయితే రిమాండ్ ఖైదీ గా విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు ఈ తన ఖాళీ సమయాన్ని అద్భుతమైన మేనిఫెస్టో( Manifesto ) రూపకల్పనకు ఉపయోగించుకుని ఉండుంటే అది మరింత ఇంపాక్ట్ కలిగించి ఉండేదని, టిడిపి ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయింది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వాఖ్యనిస్తున్నారు.

Advertisement

అంతేకాకుండా ప్రాథమిక సాక్షాదారాలు ఉన్నందువల్లే చంద్రబాబు కి న్యాయస్థానాల్లో రిలీఫ్ దొరకడం లేదని మరలాంటప్పుడు తన అరెస్టు కుట్ర అని ఎలా చెప్పగలరు అంటూ కూడా అధికార పార్టీ నుంచి చంద్రబాబు పై సెటైర్లు పడుతున్నాయి.ఏది ఏమైనా ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రజల తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడానికి తెలుగుదేశంపార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా ఈ లేఖ ఉదంతం ద్వారా రుజువు అవుతుంది.అంతేకాకుండా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) చేయబోయే యాత్రకు ముందస్తు హైప్ ను క్రియేట్ చేయడానికి కూడా తెలుగుదేశం ఈ లేఖను వాడుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు