అవును, గేమింగ్ లవర్స్( Gaming Lovers ) ఎంతగానో ఎదురు చూస్తున్న ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వచ్చేశాయ్.దేశీయ కంపెనీ మివీ కొత్త ఇయర్‌బడ్స్ ‘మివీ కమాండో ఎక్స్9’ని( Mivi Commando X9 ) భారత మార్కెట్‌లో తాజాగా లాంచ్ చేసింది.
కాగా వీటిని ప్రపంచంలోనే మొట్టమొదటి గేమింగ్ ఇయర్‌బడ్స్( Gaming Earbuds ) అని కంపెనీ పేర్కొనడం విశేషం.మివీ కమాండో X9 పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అన్న విషయం ఇక్కడ గుర్తు పెట్టుకొంది.కాబట్టి ఈ ఇయర్‌బడ్స్ ధర కూడా అందరికీ అందుబాటు ధరలలోనే అనగా రూ.1,499గా వుంది.ఫ్లిప్‌కార్ట్ కాకుండా, కంపెనీ వెబ్‌సైట్ నుండి బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో అండ్ గ్రే కలర్స్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

ఇకపోతే గేమింగ్ మార్కెట్ కి భరత్ పెట్టింది పేరు.అందుకే చాలా సంస్థలు ఇక్కడ గేమింగ్ పరిశ్రమపైన కన్నేశాయి.ఈ మధ్య కాలంలో అయితే చాలా ఉత్పత్తులు దేశీయంగానే తయారవడం విశేషంగా చెప్పుకోవాలి.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడే అత్యధిక గేమర్స్ వున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి.ఇకపోతే మివీ కమాండో X9 కేస్ ఇంకా పాడ్ రెండింటి కలర్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు.

మివీ కమాండో X9 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే…
1.మివీ కమాండో X9 13ఎంఎం డ్రైవర్ ని కలిగి ఉంది.
2.ఫ్రీక్వెన్సీ 20Hz నుండి 20KHz వరకు ఉంటుంది.
3.ఈ ఇయర్‌బడ్స్ 72 గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటాయి.
4.అయితే 10 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 15 గంటల బ్యాకప్ ఉంటుంది.
5.గేమింగ్ కోసం 35ms అల్ట్రా లో లాటెన్సి ఉంది.
5.AAC ఇంకా SBC కోడెక్‌లకు సపోర్ట్ చేస్తుంది.
6.ఇందులో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది.
7.చెమట రిసిస్టంట్ కోసం IPX 4 రేటింగ్‌ను పొందింది.
8.ఇంకా మెరుగైన కాలింగ్ కోసం క్వాడ్ మైక్ కలదు.







