భారత వ్యోమగాములు అంతరిక్షంలోని వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది.ఈ మేరకు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ లో( Vikram Sarabhai Space Centre ) ‘గగన్ యాన్’( Gaganyaan ) వ్యోమగాములను ఇస్రో ప్రకటించింది.
ఈ క్రమంలో నలుగురు ఆస్ట్రనాట్స్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిచయం చేశారు.మిషన్ గగన్ యాన్ కు ఎంపిక అయిన వారిలో గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్,( Prashanth Balakrishnan ) అజిత్ కృష్ణన్,( Ajith Krishnan ) అంగద్ ప్రతాప్ తో( Angad Pratap ) పాటు వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా( Shubhanshu Shukla ) ఉన్నారు.

ఇప్పటికే వేర్వేరు అంతరిక్ష కేంద్రాల్లో నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్నారు.గగన్ యాన్ పురోగతిపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ నలుగురు వ్యోమగాములను ప్రత్యేకంగా అభినందించారు.తరువాత వ్యోమగాములకు ప్రధాని మోదీ, ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అధికారులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.







