కొత్త రకం కరోనా...మింక్ నుంచే అంటున్న నిపుణులు

ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే ఇప్పుడు తాజాగా మరో కొత్త రకం కరోనా వైరస్ భారీగా ప్రబలుతున్నట్లు తెలుస్తుంది.

మింక్ అనే జంతువుల నుంచి ఈ కొత్త రకం వైరస్ మనుషులకు సోకుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

యూరప్ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ,బ్రిటన్ దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Denmark Found Mink Related Coronavirus, Mink, Denmark , New Corona Virus, Minks

అటు ఆస్ట్రియాతో పాటుగా మరికొన్ని దేశాలు కూడా కఠిన నిబంధలు అమలు చేస్తున్నారు.డెన్మార్క్ లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది.

అయితే, ఇప్పుడు అక్కడ కొత్తరకం కరోనా వైరస్ ను అధికారులు గుర్తించారు.మింక్ అనే జంతువుల నుంచి కొత్తరకం కరోనా వైరస్ మనుషులకు సోకుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఈ కొత్త రకం వైరస్ ఉత్తర జూట్ ల్యాండ్ లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.దీనికి కారణం ఆ ప్రాంతంలో దాదాపుగా 1100 మింక్ జంతు పెంపుడు కేంద్రాలు ఉండడమే.దాదాపు ఆ కేంద్రాలన్నిటిలో కలిపి 1.7 కోట్ల మింక్ జంతువులను పెంచుతుండడం తో ఈ సమస్య ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే 207 మింక్ పెంపుడు కేంద్రాల్లో ఈ రకం వైరస్ ను గుర్తించినట్లు సమాచారం.

ఈ మింక్ జంతువుల నుంచి మొత్తం 214 మందికి ఈ కొత్తరకం కరోనా వైరస్ సోకింది.దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై ఆ ప్రాంతం నుంచి వైరస్ బయటప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

గత ఐదారు నెలలుగా ఈ వైరస్ మింక్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించడం మొదలుపెట్టిందని, ఇప్పటికే ఆలస్యం అయ్యిందని, కట్టడికి కఠిన చర్యలు తీసుకోకుండా మరో వుహాన్ నగరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే ఈ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య భారీ గా నమోదు కాగా, ఇప్పుడు కొత్తగా ఈ కొత్తరకం కరోనా తో ఇంకెంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుందా అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు