చంద్రబాబుకు మంత్రి వేణుగోపాలకృష్ణ సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి వేణుగోపాల కృష్ణ సవాల్ చేశారు.నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ లేదని తెలిపారు.

బీసీలకు అన్యాయం జరిగిందని లోకేశ్ మాట్లాడుతున్నారన్నారు.టీడీపీ హయాంలోనే బీసీలకు అన్యాయం జరిగిందని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.14 ఏళ్ల పాలనలో చంద్రబాబు బీసీలకు ఏమీ చేయలేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో బీసీలకు ఎవరు మేలు చేశారో బహిరంగ చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేశారు.

నాలుగేళ్ల వైసీపీ పాలనలో బీసీలకు లక్షలాది కోట్లు అందాయన్నారు.చంద్రబాబు, లోకేశ్ అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు