సీరియల్ కిల్లర్ తరహాలో 12 మంది స్నేహితులను హత్య చేసిన యువతి..!

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణ హత్యలను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది.కానీ కొన్ని దారుణ హత్యలు చూస్తే భయభ్రాంతులకు గురవడంతో పాటు ఆ సన్నివేశాలు గుర్తుకు వస్తే ఒళ్ళు గగర్పొస్తుంది.

 Thai Woman Arrested For Killing 12 Friends With Cyanide Details, Thailand Woman-TeluguStop.com

ఇలాంటి కోవకు చెందిన ఒక క్రైమ్ స్టోరీ( Crime Story ) వింటే ఒళ్లంతా చెమటలు పడతాయి.అసలు ఇలాంటి వారు కూడా ఉన్నారా.? మరి ఇంతటి ఘోరంగా పాల్పడతారా అనిపిస్తుంది.ఒక మహిళ సీరియల్ కిల్లర్ గా( Serial Killer ) మారి ఏకంగా 12 మంది స్నేహితులను దారుణంగా హత్య చేసింది.

తన స్నేహితులకు సైనైడ్( Cyanide ) ఇచ్చి హత్యలు చేస్తూ ఉండడంతో.ఎందుకు చనిపోయారు? ఎవరు చంపుతున్నారు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకక పోలీసులు నానా అవస్థలు పడ్డారు.పోలీసులకు ఈ హత్య కేసులు ఛాలెంజింగ్ గా మారాయి.అయితే చివరికి ఓ మహిళను నిందితురాలిగా గుర్తించి అరెస్టు చేశారు ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

థాయిలాండ్ లో( Thailand ) డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 వరకు 12 హత్యలు జరిగాయి.హత్యకు గురైన వారందరూ 33 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు.ఈ 12 హత్య కేసులలో ఒక కేసైనా సిరిపోర్న్ ఖాన్వాంగ్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాము వెతుకుతున్నది ఓ సీరియల్ కిల్లర్ అని గ్రహించారు పోలీసులు.32 ఏళ్ల గర్భిణీ సరరత్ రంగ్ సివుతాపోర్న్ అనే మహిళను నిందితురాలిగా గుర్తించారు.

Telugu Friends, Serial Killer, Thailand-Latest News - Telugu

ఈనెల ఏప్రిల్ సిరిపోర్న్ ఖాన్వాంగ్ తో కలిసి సరరత్ రచ్చబురి ప్రావిన్స్ కు పిక్నిక్ కోసం వెళ్ళింది.ఇద్దరూ ఎంచక్కా బౌద్ధ ఆచారంలో పాల్గొన్నారు.కాసేపటికి సిరిపోర్న్ ( Siriporn ) కుప్పకూలి ప్రాణాలు విడిచింది.పోలీసులు పోస్ట్ మార్టం నిర్వర్తించగా సిరిపోర్న్ గుండెపోటుతో చనిపోయినట్లు నివేదిక వచ్చింది.అంతేకాకుండా ఆమె శరీరంలో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది.ఈమె మృతి చెందిన తర్వాత ఈమెకు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్, ఇతర వస్తువులు అన్నీ కనిపించకుండా పోయాయి.

Telugu Friends, Serial Killer, Thailand-Latest News - Telugu

దీంతో ఇంతకు ముందు జరిగిన 11 హత్య కేసులలో అచ్చం ఇలానే జరగడంతో సిరరత్ తో పాటు ఆమె మాజీ ప్రియుడు పై పోలీసులకు అనుమానం వచ్చింది.అంటే జరిగిన 12 హత్యలు అచ్చం ఒకేలా జరగడంతో పాటు హత్యల అనంతరం వారికి సంబంధించిన వస్తువులు అన్నీ మాయం కావడంతో సిరరత్ పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పూర్తిస్థాయిలో విచారణ జరిపి హత్యల వెనుక ఉండే కారణం ఏంటో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube