తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పగలరా?.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పగలరా? అంటూ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.కేవలం తెలంగాణ పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ప్రధాన మంత్రి మోదీ తన అక్కసు వెళ్లబోసుకున్నారని అన్నారు.

 Minister Talasani Srinivas Yadav Fires On Prime Minister Modi Details, Minister-TeluguStop.com

శుక్రకవారం TRSLP లో మంత్రి తలసాని మరో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా?కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని అన్నారు.రాష్ట్రానికో వేషం, తీరొక్క డ్రెస్సు లతో షోవింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రశ్నించిన వారిని కేంద్ర సంస్థలను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే ఎవరూ భయపడరని అన్నారు.

అధికారం ప్రజలు ఇచ్చిన అవకాశం.మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా…మేము సిద్ధంగా ఉన్నామన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల లాగా అమలు అవుతున్నాయి.తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.

తెలంగాణ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు BJP పాలిత రాష్ట్రాలలో అమలు అవుతున్నాయా? అంటూప్రశ్నించారు.రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి KCR కుటుంబాన్ని కుటుంబ పాలన అని పేర్కొనడం అవివేకమని అన్నారు.

తెలంగాణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాలలో KCR కుటుంబం పాల్గొన్నది.ఇష్టానుసారంగా మాట్లాడుతున్న BJP నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత అధినాయకత్వానిదేనని, తెలంగాణ రాష్ట్రం ఎంతో సురక్షితంగా ఉన్నందున భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రధానికి ముఖ్యమంత్రులు ఎందుకు స్వాగతం పలికేందుకు రావడం లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీనూతనంగా 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లు జారీ చేశామని, కానీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న చరిత్ర మీది కాదా? అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube