రాష్ట్ర మంత్రి డా V శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో HCA పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.సమావేశం ప్రారంభం.
హాజరైన HCA అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, Sports సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.టికెట్స్ ఘటనకు బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం.
జింఖాన గ్రౌండ్స్ ఘటనపై క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్.మ్యాచ్ టికెట్ల కోసం లక్షల మంది యువకులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు.
అనుకోకుండా జింఖాన గ్రౌండ్స్ లో చిన్న సంఘటన జరిగింది.
జింఖాన గ్రౌండ్స్ ఘటనలో బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తాం.
తెలంగాణ, హైదరాబాద్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు.దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
ఈ మ్యాచ్ ఘనంగా నిర్వహిస్తాం.మరిన్ని మ్యాచ్ లు వచ్చే విధంగా కృషి చేస్తాం.
భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు జరగకుండా చూస్తాం.హెచ్ సీ ఏ కొంత నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఘటన జరిగింది.
ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో ఘటన పై విచారణ చేస్తున్నాం.ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.