వైసీపీ మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.దమ్ముంటే చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన చేపట్టిన సంగతి తెలిసింది.చంద్రబాబు చేపట్టిన ఈ మూడు రోజుల పర్యటనలో అనేక ఉద్రిక్తత సంఘటనలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్ర ప్రతిపక్ష నేత సొంత నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన వాళ్లు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో సీఎం జగన్ పై నారా లోకేష్ కామెంట్లు చేయటంతో రోజా రియాక్ట్ అయ్యారు.
లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్ లో ఉత్తమ కుమారుడు గుర్తుకొస్తున్నాడని సెటైర్లు వేశాడు.జగన్ కాలి గోటికి కూడా లోకేష్ సరిపోడని వార్డు మెంబర్గా కూడ గెలవలేని వ్యక్తి అని విమర్శించారు.
కుప్పంలో లోకేష్ పర్యటించాకే మున్సిపాలిటీ కూడా టీడీపీ ఓడిపోయిందని సెటైర్లు వేశారు.కుప్పంలో దాడులకు పాల్పడ్డ వారిపై కేసులు పెట్టకుండా సన్మానించాలా అంటూ ఇటీవల జరిగిన సంఘటన ఉద్దేశించి మంత్రి రోజా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
జగన్ ఫ్యాక్షనిస్ట్ కాదు దమ్మున్న సీఎం అని కొనియాడారు.33 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి కుప్పంలో సీఎం జగన్ పాలనలో జరిగిందని చెప్పుకొచ్చారు.చంద్రబాబుని కుప్పం నడిరోడ్డుపై కూర్చోబెట్టారని అన్నారు.గత 33 సంవత్సరాల లో ఎప్పుడూ పెద్దగా పర్యటించని చంద్రబాబు గత మూడేళ్లలో సొంత నియోజకవర్గంలో పర్యటించారని దానికి కారణం వైసీపీ పార్టీ అని అన్నారు.
చంద్రబాబుకి దమ్ముంటే రాజీనామా చేసి కుప్పంలో పోటీ చేసి మళ్ళీ గెలవాలని ఈ సందర్భంగా మంత్రి రోజా సవాల్ విసిరారు.







