మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హిమాన్షు పూర్తి పేరు హిమాన్షు రావు కాగా తాజాగా కేటీఆర్ కొడుకు తన పాటతో అందరినీ ఆశ్చర్యపరిచారు.
కేటీఆర్ కొడుకులో ఇంత టాలెంట్ ఉందా అంటూ నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం.కొడుకు పాటకు ఫిదా అయిన కేటీఆర్ యూట్యూబ్ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కేటీఆర్ కొడుకును ప్రశంసిస్తూ పుత్రోత్సహాన్ని ప్రదర్శించారు.కొడుకు విషయంలో గర్వంగా ఉందని కేటీఆర్ కామెంట్ చేయగా ఆ కామెంట్ వైరల్ అవుతోంది.గోల్డెన్ లవర్ అనే ఇంగ్లీష్ పాటను ప్రొఫెషనల్ సింగర్లలా హిమాన్షు అద్భుతంగా పాడారు.కొడుకు ప్రతిభను ప్రోత్సహిస్తున్న కేటీఆర్ ను సైతం నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
యూట్యూబ్ వీడియోను లైక్ చేయాలని కేటీఆర్ కోరడం గమనార్హం.
ప్రౌడ్ అండ్ ఎగ్జైటెడ్ ఫర్ మై సన్ అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఇంగ్లీష్ యాసను హిమాన్షు అద్భుతంగా ఫాలో అయ్యారని కొంతమంది ఒ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
రాబోయే రోజుల్లో హిమాన్షు మరిన్ని సాంగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు హిమాన్షు కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.గోల్డెన్ అవర్ x హిమాన్షు కవర్ పేరుతో ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.హిమాన్షును అభిమానించే అభిమానుల సంఖ్య సోషల్ మీడియాలో పెరుగుతోంది.
మంత్రి కేటీఆర్ కీర్తి ప్రతిష్టలను హిమాన్షు మరింత పెంచుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హిమాన్షు వాయిస్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతుండటం గమనార్హం.