ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా..రాహుల్ గాంధీ..అంటూ 17 ప్రశ్నలు వేసిన మంత్రి కేటీఆర్..!!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్( KTR ) బిజీబిజీగా గడుపుతున్నారు.ఒకపక్క బహిరంగ సభలు.

 Minister Ktr Asked Rahul Gandhi Seventeen Questions Telangana Elections, Ktr-TeluguStop.com

రోడ్ షోలలో పాల్గొంటూనే మరోపక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.యువతకు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) జాతీయ కీలక నేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా కేటీఆర్ 17 ప్రశ్నలు వేశారు.

“ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా.రాహుల్ గాంధీ.??

1)దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా వుందా.?

2)తొమ్మిదిన్నర ఏండ్లలో 2లక్షల 2వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.ఒక లక్షా 60వేల083 నియామకాలను పూర్తిచేసింది మా ప్రభుత్వం.ఈ లెక్కతప్పని నిరూపించగలవా.?

3)మీరు అధికారం వెలగబెట్టిన పదేండ్ల కాలంలో( 2004-14 ) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? కేవలం 10వేల 116 మాత్రమే కాదా? ఇదేనా నిరుద్యోగులైన మీ ప్రేమ.?

4)మా ప్రభుత్వం ఏడాదికి సగటున నింపిన సర్కారు కొలువులు 16,850!

మీ హయాంలో( 2004-14 ) సంవత్సరానికి ఇచ్చింది కేవలం 1012 జాబులు.

ఇదీ మీకూ మాకూ వున్న తేడా.! మీరొచ్చి మాకు సుద్దులు చెబితే ఎట్లా.

5) జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా.? ఉద్యోగం చేసావా.? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా.? పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూ కు వెళ్లినవా.? ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా నీకు.

6) 95 శాతం ఉద్యోగాలు స్థానిక బిడ్డలకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన నిబద్ధత మాది.! మా కొలువులు మాకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టి నియామకాల నినాదాన్ని నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా.?

7) 1972 లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధలను సమర్థిస్తూ తీర్పునిస్తే.పార్లమెంట్ లో చట్టంచేసి ముల్కీ రూల్స్ ను రద్దుచేసి.తెలంగాణ స్థానికత హక్కులకు సమాధికట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా.?

8) ఆరుసూత్రాలు.610 జీవోలు.గిర్ గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి.

హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా మార్చేసి .నాన్ లోకల్ కోటాలు పెట్టి.తెలంగాణ యువతకు దక్కాల్సిన కొలువులను కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు కాదా.?

9)మీ పనికిమాలిన పాలనలో ఉపాధిలేక.ఉద్యోగాల్లేక నిరాశా నిస్పహలతో తెలంగాణ యువత తుపాకులు చేతబట్టి అడవిబాటపట్టి నక్సలైట్లలో చేరింది నిజమా.? కాదా.

10)వేలమంది యువకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి .ఎన్కౌంటర్ల పేరుతో నిత్యం నెత్తుటేర్లు పారించిన కర్కశ మైన పాలన మీది కాదా.

11) మీ కాలంలో ఏపీపీఎస్సీ అక్రమాలకు అడ్డాగా మారి.అంగట్లో బేరంపెట్టి కొలువులను అమ్ముకోలేదా.? ప్రాంతీయ వివక్షతో.ఇంటర్వ్యూల ముసుగులో తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా చేసింది నిజం కాదా.?

12)1952లో నాన్ ముల్కీ గోబ్యాక్.ఇండ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినదించిన విద్యార్థులపై తూటాలు పేల్చి.

ఏడుగురు తెలంగాణ ముద్దు బిడ్డల్ని చంపిన దుర్మార్గులు.దోషులు మీరు కాదా.

13)1969లో జై తెలంగాణ అని నినదించిన 369 మంది యువకిశోరాల గుండెల్లో తుపాకిగుండ్లు దించి పొట్టనపెట్టుకున్న నర హంతకులు మీరు కాదా.

14)2004లో తెలంగాణకు ఇచ్చిన మాటతప్పి.పదేండ్లు కాలయాపన చేసి వందల మంది యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన నేరం మీదికాదా.? సోనియగాంధీ బలిదేవతని మీ పీసీసీ ప్రెసిడెంటే చెప్పింది అబద్ధమా.

15) కర్ణాటకలో 100 రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి? 6 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెబ్తవా.? వాగ్దానం చేసి యువతను వంచించలేదా.

16) మీరు రాజ్యం ఏలుతున్న రాజస్థాన్ లో.చత్తీస్ గఢ్ లో.హిమాచల్ ప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీహామీని మరిచి.నిరుద్యోగులను నిండా ముంచింది నిజం కాదా.?

17) మీరు ప్రకటించిన పసలేని జాబ్ కేలండర్ ఒక పచ్చి మోసం కాదా.? ఎన్నికల కోడ్ అమల్లో వుండే 2024 మార్చి .ఏప్రిల్ …మే నెలల్లో ఉద్యోగ పరీక్షలు ఎట్లా సాధ్యం.? యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా.?” అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube