జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు.పవన్ కల్యాణ్ కు పరిపాలన గురించి ఏ మాత్రం అవగాహన లేదని తెలిపారు.
అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.గతంలో చంద్రబాబును ప్రశ్నించని పవన్ ఇప్పుడు జగన్ ను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
టీడీపీ హయాంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని, విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉండేవని తెలిపారు.కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలో ఎంతో అభివృద్ధి చెందాయన్న సంగతి గుర్తు చేశారు.
పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం వద్దంటూ గతంలో చంద్రబాబు, పవన్ అడ్డుకున్నారన్న మంత్రి కారుమూరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడటం ముచ్చటగా ఉందని వెల్లడించారు.







