నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగతమన్నారు.
వైసీపీపై బురద జల్లే ప్రయత్నాన్ని కోటంరెడ్డి మానుకోవాలని మంత్రి సూచించారు.కారణాలు వెతికి మరీ టీడీపీకి మేలు చేసేలా వ్యవహరించారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగింది.నమ్మకం లేని చోట ఉండలేనన్నారు…కోర్టులో కేసు వేస్తానన్నావ్ ఏమైందని ప్రశ్నించారు.
కేంద్రానికి ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు.వాయిస్ రికార్డెడ్ అని చాలా సందర్భాల్లో చెప్పామన్నారు.
టీడీపీ అభ్యర్థిగా ఖరారు అయ్యాక కోటంరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.నిన్నటి వరకు జగన్ కు విధేయుడిగా ఉన్న కోటంరెడ్డి ఇప్పుడు వేరొకరికి విధేయుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న ఆయన మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని మండిపడ్డారు.జగన్ కు నీపైన అనుమానం ఉంటే నెల్లూరు బాధ్యతలు అప్పగించేవారా అని ప్రశ్నించారు.