ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ 2024 ఎన్నికల గెలుపు విషయంలో చాలా ధీమాగా ఉంది.ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నేతలను ప్రజలలో ఉంచుతూ ప్రచారం.
అభ్యర్థుల ఎంపిక విషయంలో పక్క ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది.ఆ రకంగానే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కాగా వచ్చే ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా తెలుగుదేశం మరియు జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మంత్రి జోగి రమేష్( Jogi Ramesh ) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ లపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇద్దరు తోడు దొంగలను వచ్చే ఎన్నికలలో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు( Chandrababu ) పచ్చి మోసగాడు.
ఈ పచ్చి మోసగాడితో దత్త పుత్రుడు, ఢిల్లీ పార్టీ కూడా అంటకాగుతోంది.దేశంలో సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడేటట్లు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు.
జగన్ పాలనలో పేదోడి ముఖంలో సంతోషం చూస్తున్నాం.మళ్లీ జగనే సీఎం గా రావాలి అని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.