టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పేదలు చనిపోవడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు.
ఇంతమంది ప్రాణాలను బలిగొంటున్న చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.చంద్రబాబు అధికార దాహంతో ఉన్నారని విమర్శించారు.
చంద్రన్న కానుక పేరుతో 30 వేల మందికి చీరలు పంచుతున్నామని చెప్పి మూడు వేల మందికి మాత్రమే పంచితే తొక్కిసలాట జరగదా అని ప్రశ్నించారు.







