టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎన్టీఆర్ కు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు.
చంద్రబాబు తరహాలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంత్రి హరీశ్ రావు అన్యాయం చేయడం ఖాయమని పేర్ని నాని తెలిపారు.చంద్రబాబులానే చేయాలని హరీశ్ రావు అనుకుంటున్నారని చెప్పారు.
ఎన్టీఆర్ అమాయకుడు కనుక చంద్రబాబుది నడిచిందన్న పేర్ని నాని కేసీఆర్ అలాంటివి సాగనివ్వరని తెలిపారు.అదేవిధంగా పవన్ చేస్తున్న వారాహి విజయ యాత్ర ఎవరిని సీఎం చేయడానికి అని ప్రశ్నించారు.సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి కదా అన్న మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు కోసం పవన్ నానా చాకిరి చేస్తున్నారని చెప్పారు.20 టికెట్లు తీసుకొని పోటీ చేయడానికే పవన్ కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు.