Minister Gudivada Amarnath Reddy : బ్యాక్ డోర్ పొలిటిషియన్ ను కాదు..: మంత్రి గుడివాడ

అనకాపల్లిలో టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి( Minister Gudivada Amarnath Reddy ) కౌంటర్ ఇచ్చారు.లోకేశ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

 Minister Gudivada Amarnath Reddy : బ్యాక్ డోర్ పొలి-TeluguStop.com

పరిశ్రమల శాఖ మంత్రి లోకేశ్ గతంలో ఏపీకి ఏం చేశారో చెప్పాలన్నారు.లోకేశ్ తరహాలో తాను బ్యాక్ డోర్ పొలిటిషియన్( Backdoor Politician ) ను కాదన్నారు.45 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్న మాజీ మంత్రి కొడుకును అన్న గుడివాడ పాలిటిక్స్ లో 18 ఏళ్లు కష్టపడ్డానని తెలిపారు.

సీఎం జగన్( CM YS Jagan ) ఛాన్స్ ఇవ్వడంతో శాసనసభుడిగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు.లోకేశ్ తాను చేసిన అవినీతిని మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే విస్నన్నపేటలో ప్రభుత్వ భూమి తన పేరుపై ఉన్నట్లు నిరూపిస్తారా అని ప్రశ్నించారు.

సెంటు భూమి తన పేరుపై ఉన్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.నారా లోకేశ్( Nara Lokesh ) తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube