కరీంనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన

ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తంగా జిల్లా యంత్రాంగం జిల్లాలో ముందస్థు చర్యలతో ఎలాంటి ఆస్థినష్టం, ప్రాణనష్టం లేవు తొమ్మిదిమంది వలసకార్మికులను వరద నుండి కాపాడి పునరావాస కేంద్రాలకు తరలింపు వల్లంపాడు నుండి తీగలగుట్టపల్లి వరకూ కాలినడకన సహాయక చర్యలు ఇరుకుల వాగు, మానేరు ముంపు గ్రామాల చుట్టూ పూర్తి స్థాయి రక్షణ చర్యలు అత్యవసర పని ఉంటేనే ప్రజలు భయటకురావాలి, వాగులు, వంకలు ప్రమాదకరంగా ఉన్న ద్రుష్ట్యా అటు వెల్లొద్దు అంటువ్యాదులు ప్రభలకుండా ప్రభుత్వం చర్యలు స్థానికుల బాగోగులు చూసుకుంటూ, అధికార యంత్రాంగం తక్షణం స్పందించేవిదంగా స్వయంగా పర్యవేక్షణ.

 Minister Ganguly's Visit To Karimnagar Flood Affected Areas , Minister Gangula-TeluguStop.com

రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలో ప్రభావితమైన ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పర్యవేక్షిస్తూ, అప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో అన్నిరకాల ముందస్థు జాగ్రత్తలు తీసుకొని, జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నామన్నారు.ముందస్థుగా ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు, నీటి నిలువ లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మానేరు ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.

ఈరోజు గురువారం ఉదయం నుండి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో వర్షంలోనే తిరుగుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు, నగరంలోని వల్లంపాడు నుండి తీగలగుట్టపల్లి వరకూ స్వయంగా కాలినడకన తిరుగుతూ ప్రజల మంచి చెడుల్ని తెలుసుకున్నారు.ఇరుకుల వాగు ఉద్రుతి పెరుగుతుండడంతో అక్కడి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఇబ్బంది పడుతున్న తొమ్మిది మంది వేరే రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను కాపాడి స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.

అంటువ్యాదులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నామని ముసురుకు తోడు, వరదతో నీళ్లు నిండిన ప్రాంతాల్లో సంచార వైద్య బ్రుందాలను తిప్పుతున్నామని ఎవరికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తక్షణమే స్పందిస్తున్నామన్నారు మంత్రి గంగుల.నగరంతో పాటు జిల్లా మొత్తంలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్న మంత్రి, ఇందుకోసం యావత్ ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు.

మానేరు, ఇరుకుల వాగుల పరివాహకంలో సంపూర్ణ జాగ్రత్త చర్యల్ని ప్రభుత్వం తీసుకుందన్నారు.ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, విద్యుత్ స్థంబాలు, నీటి కుంటల వద్దకు వెల్ల్లోద్దని విజ్నఫ్తి చేసారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప హరిశంకర్.కలెక్టర్ కర్ణన్, అన్ని శాఖల జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube