వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎన్నికల కోసం మళ్లీ కొందరు పాదయాత్ర పేరుతో వస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సంపదను దోచుకునేందుకు మళ్లీ వస్తున్నారంటూ మంత్రి గంగుల ఆరోపించారు.షర్మిలకు తెలంగాణలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణను మళ్లీ గుడ్డి దీపం చేయాలని చూస్తున్నారన్నారు.ఎన్నికల కోసం చాలా మంది వస్తూ పోతూ ఉంటారన్న మంత్రి గంగుల రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.







