ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య ధర్మమేనా.? అని ప్రశ్నించారు.సి.పి.ఎస్ అంశంపై సాధ్యాసాధ్యాల కోసం అధ్యయన కమిటీ ఉందన్నారు.ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు.విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు.
సుయ్యి మంటే నాదో అట్టు అన్నట్టు తయారయ్యాయి ప్రతిపక్షాలు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
.






