ప్రశాంత్ కిషోర్ కు మంత్రి బొత్స కౌంటర్..!!

ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ( YCP Minister Botsa Satyanarayana ) కౌంటర్ ఇచ్చారు.

ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu ) కోసం మాట్లాడుతున్నారని తెలిపారు.ప్యాకేజీ తీసుకుని ఆయన మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

YCP Minister Botsa Satyanarayana Counter To Prashant Kishor..!!,Prashant Kishor

ప్రశాంత్ కిషోర్ రివర్స్ లో తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు.నాయకుడికి, ప్రొవైడర్ కు ఉన్న తేడా కూడా పీకేకు తెలియడం లేదా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే జనంలో నుండి వచ్చిన నేత సీఎం జగన్( CM YS Jagan ) అని తెలిపారు.మంచి జరిగితేనే ఓటు వేయాలంటున్న జగన్ నాయకుడా? జగన్ ను విమర్శిస్తూ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగే చంద్రబాబు నాయకుడా ? అన్నది చెప్పాలన్నారు.గత ఎన్నికల్లో జగన్ తరపున పని చేసిన ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) తన మాటలను ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.

Advertisement
తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న తెలుగు హీరోయిన్స్ వీళ్ళే

తాజా వార్తలు