రంజాన్ ప్రార్ధనలు ఇంట్లోనే చేయండి.. ఎం.ఐ.ఎం చీఫ్ అసదుద్దీన్..!

కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలో 10 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం.

మే 12 నుండి 21 తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.

అయితే ఈ లాక్ డౌన్ 10 రోజులే ఉంటుందా కొనసాగుతుందా అన్నది 20న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారు.కేసులు తగ్గుముఖం పట్టిన దాన్ని బట్టి లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు.

ఇక ఇలాంటి టైంలో పండుగలు జరుపుకునే అవకాశం లేదు.ఈ నెల 13న రంజాన్ పండుగను ముస్లీం సోదరులు ఇంట్లోనే జరుపుకోవాలని చెప్పారు ఎం.ఐ.ఎం చీఫ్ అసదుద్దీన్.కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని.

లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే రంజాన్ ప్రార్ధనలు చేసుకోవాలని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.రంజాన్ కు సంబందించిన షాపింగ్స్ తో హైదరాబాద్ ఓల్డ్ సిటీ కళకళలాడుతుంది.

Advertisement

బుధవారం లాక్ డౌన్ ఉన్నా సరే కొన్నిచోట్ల రంజాన్ సంబందించిన షాపింగ్ జరిగినట్టు తెలుస్తుంది.లాక్ డౌన్ తొలిరోజు కాబట్టి పోలీసులు కూడా ఈరోజు వరకు వదిలేశారు.

కాని రేపటి నుండి లాక్ డౌన్ ను కఠినంగా ఉండేలా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించగా తెలంగాణా కూడా 10 రోజుల లాక్ డౌన్ విధించి కరోనా కేసులను నియంత్రించాలని చూస్తుంది.

Advertisement

తాజా వార్తలు